Romantic Telugu Love SMS

Oka manchi mata

మనకు ఎందరో పరిచయం అవుతుంటారు
అందులో కొందరే మంచి స్నేహితులవుతారు
మనతో మంచి చెడు పంచుకుంటూ
మంచి స్నేహితులు దొరకడం ఒక అదృష్టం కూడా

1.”ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే పారిపోయేవారు అనామకులు గానే మిగిలిపోతారు”…

2.’అంతా తనదే’ అన్నది మమకారము.’అంతాతనే’ అన్నది అహంకారము…

3.”నేడు రేపటికి ‘నిన్న’ అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి”…

4.”మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End..’అంతే అయిపోయింది ఇంకేమీ లేదు’ అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది”…

5.”నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వారికీ నచ్చలేదన్నమాట”…

6.”ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి”…

7.”నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు….!